శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (12:06 IST)

రామ్ గోపాల్ వర్మ మస్కా చస్కా పాలిష్ సూపర్ పాలిష్

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా సర్టిఫికేట్ ఇచ్చేశారు కదా. అంతేకాదండోయ్... కేసీఆర్ జాతిపిత మహాత్మా గాంధీ, బాల్ థాక్రేల కంటే కూడా బెటర్ అని మరో సర్టిఫికేట్ ఇచ్చేశారు. కేసీఆర్ చంద్రబాబు కంటే కూడా చాలా బెటర్ అంటూ కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలని కూడా సలహా ఇచ్చేశారు.
 
‘తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బాగా పని చేస్తున్నారని నా అభిప్రాయం' అని వర్మ సందేశం పోస్టు చేశాడు. అంతటితో ఆగకుండా ‘శివసేన అధ్యక్షుడు దివంగత బాల్ థాక్రే, మహాత్మా గాంధీల కంటే కెసిఆర్ బెటర్'గా పని చేస్తున్నారు' అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుపట్టడం లేదని రామ్ గోపాల్ వర్మ క్లారిటీ కూడా ఇచ్చేశాడు.