బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. »
  3. తెలుగు వార్తలు
  4. »
  5. జాతీయ వార్తలు
Written By Ganesh
Last Updated : మంగళవారం, 27 మే 2014 (17:04 IST)

26న మోడీ ప్రమాణ స్వీకారం.. నేడు గుజరాత్ సీఎం పదవికి రిజైన్!

FILE
బీజేపీ పార్లమెంటరీ నేతగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన నేడు గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోడీ తన రాజీనామా లేఖను గవర్నర్ కమ్లా బేణీవాల్‌కు సమర్పిస్తారు. గుజరాత్ శాసనసభలో తన గౌరవార్థం ఏర్పాటు చేసే వీడ్కోలు సమావేశానికి మోడీ హాజరవుతారు. ఈరోజు మధ్యాహ్నం 3.30కి మోడీ రాజీనామా సమర్పిస్తారు.

భారతదేశ నూతన ప్రధానమంత్రిగా మే 26, సోమవారం నాడు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భవన్‌లో దేశ 14వ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. మే 26 సాయంత్రం 6 గంటలకు ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానించారు అని మంగళవారం రాష్ట్రపతితో భేటీ అనంతరం నరేంద్ర మోడీ తెలిపారు.