శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : ఆదివారం, 1 మార్చి 2015 (15:45 IST)

రామ్ గోపాల్ వర్మ అరెస్టు.. ఎప్పుడు.. ఎక్కడ..?!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కలకలం రేపారు. ఇటీవల ఎప్పుడూ ట్విట్టర్‌లో ఉండే వర్మ తాజాగా తనను పోలీసులు అరెస్టు చేశారంటూ ఫోటోతో పాటు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అయితే ఆయన నిజంగా అరెస్ట్ అయ్యారా లేక సెట్‌లో ఇలా ఫన్ గా ఎంజాయ్ చేస్తున్నారా ! అనేది అర్ధం కావడం లేదు.

ఈ అరెస్ట్ అయిన కథ వెనకాల రహస్యం కాస్త ఆగి మెల్లగా తెలుసుకోవాల్సిందే.. కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మంచు మనోజ్ తో సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా టైటిల్ ని 'గొలుసు'అని ఫస్ట్ అన్నారు కానీ, ఇప్పుడు 'గొలుసు'ని చేంజ్ చేసి 'ఎటాక్' గా ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు.