శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:55 IST)

మంచు ఫ్యామిలీ మీద పడ్డ వర్మ... మంచు లక్ష్మి పాదాలతో వర్మ చిత్రం

సినిమా అనేది ఒక ఎమోషనల్‌ అనుభవం. అది ఏడిపించొచ్చు నవ్వించొచ్చు. థ్రిల్‌ చేయొచ్చు లేదా ఆశ్చర్యపరచవచ్చు. కానీ ఈ ఎమోషన్స్‌లో ఏవైనా కూడా ఒక రెండు గంటల నిడివి ఉండాల్సిన అవసరం లేదు. ఆ నిడివే యావరేజ్‌గా ఒక సినిమా లెంగ్త్. ఎన్నోసార్లు నాకు ఎన్ని ఎగ్జయిట్‌ సినిమాటిక్‌ ఐడియాలొచ్చినా.. అవి ఒక ఫీచర్‌ ఫిల్మ్‌ లెంగ్త్‌కి సరిపోవు గనుక వాటిని వదిలేయాల్సి వస్తుంది. 
 
కానీ నాకు సడన్‌గా వచ్చిన ఐడియా ఏమిటంటే.. షార్ట్‌ ఫిలింలతో టైమ్‌ రెస్ట్రిక్షన్‌ వుండదు కాబట్టి.. ఐడియాకి ఎంత నిడివి కావాలో అంత నిడివిలోనే సినిమా తీయవచ్చని. ఈ ఆలోచన రాగానే నేనొక షార్ట్‌ ఫిలిం ఐడియాతో లక్ష్మీమంచుని కలిసి తనతో నా ఐడియా చెప్పాను. నా ఐడియా విన్న వెంటనే తను 'తన పాదాలను' నా షార్ట్‌ ఫిలింలో నటింపచేయించడానికి ఒప్పుకుంది. 
 
నా మొట్టమొదటి షార్ట్‌ ఫిలిం 'లక్ష్మీ మంచు పాదాలు'.. జీవితంలో ఒక రోజు నా ఈ షార్ట్‌ ఫిలింని యూట్యూబ్‌లో అక్టోబర్‌ 8న మంచు లక్ష్మీపుట్టినరోజున విడుదల చేయబోతున్నామని.. రామ్‌గోపాల్‌వర్మ ప్రకటన విడుదల చేశారు.