శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 22 అక్టోబరు 2014 (12:43 IST)

రాంగోపాల్ వర్మ మళ్లీ సైన్ ఇన్ అయి ఔట్ చేసేశారు...

ట్విట్టర్ ను బాగా వాడుకోవడంలో రాంగోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. తన మైండులో ఏది వస్తే అది వెంటనే ట్విట్టర్ లోకి సైన్ ఇన్ అయి దానిని ఔట్ చేసేస్తుంటారు. అలాంటిదే మళ్లీ మరొకటి పేల్చారు. అదేంటయా అంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తుపాన్ బాధితులు... ముఖ్యంగా విశాఖపట్టణం వాసులు తాము త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. 
 
ఈ దీపావళికి పెద్దఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. దీనిపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో సెటైర్లు వేశారు. అసలు వాళ్లకు ఈ పరిస్థితి కల్పించింది ఆ దేవుడు కదా? మరి ఆ దేవుడు తెచ్చిన కష్టాలను తొలగించమని కోరుకుంటూ తిరిగి అదే దేవుడికి ప్రార్థనలు చేయడం ఏమిటంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. 
 
అంటే... దేవుడిని ప్రార్థించకూడదనేగా వర్మ ట్వీట్ సారాంశం. వర్మ దెబ్బకు దేవుళ్లు కూడా భయపడిపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు... వర్మకు మండిందంటే... విశాఖకు నష్టాన్ని కల్గించిన హుధుద్ తుఫానుపై చిత్రాన్ని లాగించినా లాగించేస్తారని అంటున్నారు.