బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (18:25 IST)

కెనడాలో మరో పాపకు జన్మనిచ్చిన రంభ..!

ప్రముఖ హీరోయిన్ రంభ పాపకు జన్మనిచ్చింది. గతంలో టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలిగిన రంభ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం తను టోర్నటో లోని హాస్పిటల్‌లో పండంటి పాపకు జన్మనిచ్చింది. పాప, రంభ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. కాగా రంభకి ఇప్పటికే మూడేళ్ల వయస్సులో మరో పాప ఉంది.

 
దక్షిణాది చిత్ర పరిశ్రమలో 1990ల్లో రంభ క్రేజీ హీరోయిన్‌గా వెలిగింది. తెలుగు 'బావగారు బాగున్నారా', తమిళంలో 'ఉల్లతై అల్లిత', 'అరుణాచలం' వంటి పలు చిత్రాలలో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం అక్కడ రంభ టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.