శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (16:34 IST)

గోవిందుడిపై బండ్ల గణేష్ నమ్మకం: పవన్ రికార్డును చెర్రీ బ్రేక్ చేస్తాడా?

ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్‌గా పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది'పేరున మాంచి రికార్డు ఉంది. ఈ 'అత్తారింటికి దారేది' రికార్డ్‌ను బ్రేక్ రామ్ చరణ్ తేజ బ్రేక్ చేస్తాడని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం పవన్ రికార్డును బద్దలు కొట్టడం అంత సులభం కాదంటున్నారు. 
 
కానీ 'గోవిందుడు అందరి వాడేలే' చిత్ర ఘనవిజయం మీద నిర్మాత బండ్ల గణేష్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ నమ్మకంతోనే, అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాను నైజాం, కృష్ణా ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాడు.
 
ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఇండస్ట్రీ హిట్ అవుతుందని బండ్ల గణేశ్ భారీ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత తాను ఈ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నానని బండ్ల గణేశ్ అంటున్నాడు.