శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (12:53 IST)

ముంబైలో ఇల్లు కొన్న రానా... బాలీవుడ్‌లో సెటిల్ అవుతారేమో...!

జీవితంలో మెట్టు మెట్టు అభివృద్ధి చెందాలని ఎవరికి మాత్రం ఉండదు. అందులో సినిమా వాళ్లైతే చెప్పనవసరం లేదు. మాతృ భాషలో ఒక్క హిట్టు కొట్టారంటే చాలు బాలీవుడ్, హాలీవుడ్‌లకు చేరి అక్కడే స్థిరపడాలని అనుకుంటారు. ఇటీవల చాలా మంది సౌత్ ఇండియన్ స్టార్స్ అంతా బాలీవుడ్‌లో నటించడానికి షిఫ్ట్ అవుతున్నారు. 
 
ఇక అసలు విషయానికి వస్తే.. రానా దగ్గుబాటి ముంబాయి‌లో కొత్తగా ఇల్లు కొన్నారు. ఈయన ఎప్పుడైనా ముంబైలో వర్క్ ఉంటే హోటల్‌లో బస చేస్తుంటారు. ఈ హోటల్‌లో ఉండే కష్టమెందుకని అక్కడ ముంబైలో జుహులో ఒక ఇంటిని కొన్నారట. ఇప్పటికే బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటిస్తున్న రానా అక్కడే స్థిరపడతారేమోనని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.