బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (11:11 IST)

సన్నీకి హ్యాండ్...! తప్పుకున్న రానా..! ఎందుకబ్బా..!

బాలీవుడ్ సెక్సీ క్వీన్ సన్నీ లియోన్‌‌కు మాటిచ్చిన రానా అకస్మాత్తుగా పక్కకు తప్పుకున్నాడట. దీంతో షాక్ తిన్న సన్నీ... హైదరాబాదీ టాల్ బాయ్ రనా ఎందుకిలా చేశాడా అంటూ బెంగెట్టుకుందట.  

అసలు విషయానికి వస్తే.. 'వన్ నైట్ స్టాండ్' అనే బాలీవుడ్ సినిమాలో నటించడానికి రానా గతంలో అంగీకరించాడు. ఇందులో సన్నీలియోన్ తో కలసి ఆయన నటించాల్సివుంది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. 
 
అయితే, ఉన్నట్టుండి ఇందులో నుంచి తాను తప్పుకున్నట్టు రానా ప్రకటించాడు. ఈ సినిమా కథ నచ్చి, చేయాలని వున్నప్పటికీ డేట్స్ ఇవ్వలేకపోతున్నాడట. దానికి కారణం, 'బాహుబలి' సినిమాకి ఎక్కువ రోజులు ఇవ్వాల్సి రావడమే అని రానా సన్నిహితులు తెలుపుతున్నారు.