శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (10:49 IST)

దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు... వర్మపై కేసుకు కోర్టు ఆదేశం

తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహస్వామినే పూజించాలి, వారికి ఆంధ్రా దేవుళ్లు ఎందుకు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ పై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీ నగర్ పోలీసులను సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం ఆదేశించింది. 
 
రాంగోపాల్‌వర్మపై చింతలకుంటకు చెందిన న్యాయవాది భార్గవ్, పులిగారి గోవర్ధన్‌రెడ్డి గురువారం కోర్టులో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడైన యాదగిరి నరసింహస్వామి కంటే ఎక్కువగా ఆంధ్రా దేవుడైన తిరుపతి వేంకటేశ్వరస్వామిని పూజించడం సరైనదేనా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచాడంటూ మేజిస్ట్రేట్‌కు వివరించారు. 
 
దీంతో ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేట్ యూసుఫ్ 153ఏ, 153బీ, 505 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మరోవైపు వర్మ వ్యాఖ్యలపై హిందూ ధర్మరక్షా సమితి నేతలు గురువారం హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.