శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (14:09 IST)

రామ్‌తో రాశిఖన్నా రొమాన్స్: శివంలో హీరోయిన్‌గా..

రామ్‌తో రాశిఖన్నా రొమాన్స్ చేయనుంది. రాశిఖన్నా టైం బాగుండటంతో వరుసగా ఆమెరు ఆఫర్లు వచ్చిపడుతున్నాయ్. 'ఊహలు గుసగుస లాడే' సినిమా విజయంతో ఈ ముద్దుగుమ్మను టాలీవుడ్ ఆఫర్లతో ముంచెత్తుతోంది. ఇప్పటికే గోపీచంద్ సరసన 'జిల్' సినిమాలో నటిస్తోంది. 
 
మరోవైపు రవితేజ సినిమాకు కూడా ఎంపికైంది. సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించే 'బెంగాల్ టైగర్' చిత్రంలో ఓ కథానాయికగా నటించనుంది. అలాగే తాజాగా రామ్ సరసన కూడా ఓ ఆఫర్ పొందింది.
 
నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి రూపొందించే 'శివం' సినిమాలో రాశి కథానాయికగా నటిస్తుంది. అలాగే, మరికొన్ని ఆఫర్లు కూడా చర్చల దశలో వున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం.