శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 11 మార్చి 2015 (16:42 IST)

తనయుడితో రవితేజ సెల్ఫీ.. ఫేస్‌బుక్‌లో పోస్ట్..!

సినీ స్టార్స్ జీవితం తెరచిన పుస్తకం అంటారు. అందుకు తగినట్టుగానే హీరో, హీరోయిన్లు వారి పర్శనల్ లైఫ్‌ను కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు. అయితే టాలీవుడ్ హీరో రవితేజ మాత్రం సాధారణంగా తన పర్శనల్ విశేషాలు కానీ, అందుకు సంబంధించిన ఫోటో గ్రాఫులు కానీ మీడియాకు ఇవ్వరు. కేవలం సినిమాలకు సంబంధించిన విశేషాలే మాట్లాడతారు.
 
అటువంటిది రవితేజ తాజాగా తన కొడుకు మహధన్‌తో కలసి తాను దిగిన సెల్ఫీని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. రవితేజ, కల్యాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు మహధన్ ఐదో తరగతి చదువుతుంటే, కుమార్తె మోక్షద తొమ్మిదో తరగతి చదువుతుంది. కాగా రవితేజ అభిమానులు ఈ ఫోటోను చేసి తెగ మురిసిపోతూ లైక్‌లు ఇచ్చేస్తున్నారు.