శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (19:26 IST)

మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు రెడీ: పటాస్ కళ్యాణ్ రామ్

మల్టీస్టారర్ మూవీ నటించేందుకు పటాస్ హీరో కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీతమ్మ వాకిట్లో సినిమా క్రేజ్‌తో టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పటాస్ సినిమా సక్సెస్ను హీరో నందమూరి కళ్యాణ్రామ్ ఆస్వాదిస్తున్నారు. 
 
తిరుపతి నగరంలోని ఓ థియేటర్లో అభిమానుల మధ్య కూర్చుని పటాస్ మూవీని కళ్యాణ్రామ్ శుక్రవారం నాడు చూశారు. సినిమా ఘనవిజయం సాధిస్తుందని, ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుండటంతో బాక్సాఫీసు దగ్గర వసూళ్లు కూడా తగ్గలేదన్నారు. 
 
'శనివారం నుంచి పటాస్ సినిమా విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటాను. మంచి కథ దొరికితే మల్టీస్టారర్ మూవీలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను' అని ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్రామ్ తెలిపారు.