బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (14:22 IST)

మంచి కథ దొరికితే బాబాయ్, తమ్ముడితో చేస్తా!: కళ్యాణ్ రామ్

మంచి కథ దొరికితే బాబాయ్‌ బాలకృష్ణ, తమ్ముడు జూ. ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేస్తామని నందమూరి కళ్యాణ్‌ రామ్‌ అన్నారు. శనివారం పటాస్‌ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చిన కళ్యాణ్‌ రామ్‌ విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
 
ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచి కథ దొరికితే బాలయ్య, జూ. ఎన్టీఆర్‌లతో కలిసి నటిస్తానన్నారు. పటాస్‌ తరువాత ‘షేర్‌’ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు.