శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2014 (12:53 IST)

''ఐ'' సినిమా రిలీజ్ లేట్ కావడానికి ఎ.ఆర్. రెహ్మానే కారణమట!

శంకర్ భారీ బడ్జెట్ మూవీ 'ఐ' విడుదల వాయిదాల మీద వాయిదాలు పడడానికి అసలు కారణం ఇప్పుడు తెలిసింది. చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కారణంగానే ఈ సినిమా ఆలస్యమవుతోందట. ఈ సినిమా రీరికార్డింగుకి రెహ్మాన్ ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కూడా కన్ఫర్మ్ చేశాడు. 
 
"ఇప్పటి వరకు ఆరు రీళ్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తయింది. మరో ఐదు రీళ్ల వర్క్ జరగాల్సివుంది. ఈ చిత్రానికి అద్భుతమైన రీరికార్డింగ్ అవసరమని రెహ్మాన్ భావించడం వల్లే తాను అంతటి సమయాన్ని తీసుకుంటున్నాడు. 
 
గత ఐదు నెలల నుంచీ చెన్నైలోనూ, లాస్ ఏంజిల్స్‌లోనూ వున్న తన రికార్డింగ్ స్టూడియోలలో తను ఈ సినిమాపైనే వర్క్ చేస్తున్నాడు. మరి కొన్నాళ్లలో ఇది పూర్తవుతుంది" అని చెప్పాడు నిర్మాత. సో, ఐ సినిమా ఎప్పటికి రీలీజ్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం.!