గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 31 మార్చి 2015 (16:14 IST)

తిట్టుకుంటే నటుడినే తిట్టుకోండి... కానీ మధ్యలో వారి భార్యలేం చేశారు... రేణూ ట్వీట్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ట్విట్టర్లో ఫ్యాన్స్ చేసే కామెంట్లపై విరుచుకుపడింది. రేణూ ట్విట్టర్లో దీనిపై స్పందిస్తూ... నటుడు లేదా రాజకీయ నాయకుడు చేసే పబ్లిక్ వర్క్ గురించి విమర్శించాలి కానీ వారి వ్యక్తిగత జీవితాన్ని ఎలా విమర్శిస్తారంటూ ప్రశ్నించింది. వ్యక్తిగత జీవితంలో వారేమి చేశారన్న దానిపైన విమర్శించడం తగదంటూ హితవు పలికింది. 
 
అంతేకాదు... ఫ్యాన్స్ ఒకరికొకరు తిట్టుకునేటపుడు కూడా నటులను తిడుతూ మధ్యలోకి వారి కుటుంబ సభ్యులను లాక్కు రావడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. వారిని ఇలా దూషించడం సమంజసం కాదంటూ ట్వీట్ చేసింది. మొత్తమ్మీద మరోసారి పవన్ కళ్యాణ్ కు గట్టిగా రేణూ దేశాయ్ సపోర్ట్ చేసినట్లు అర్థమవుతుంది.