శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 27 నవంబరు 2014 (18:08 IST)

వర్మ బయోగ్రఫీ టచ్ చేసి మోసపోయాడట... 80 లక్షలతో దిగుతున్నాడు...

రామ్‌గోపాల్‌ వర్మ... ఈ పేరు కొత్త దర్శకులకు ఓ బ్రాండ్‌. అలాంటి ఆయన పేరు మీద ఓ సినిమాను తెరకెక్కించాడు రత్నాచారి. ఇతను ఖమ్మంలోని మధిరకు చెందినవాడు. దర్శకుడిగా అవకాశాల కోసం తెగ తిరిగాడు. కానీ ఎవ్వరూ ఇవ్వలేదు అవకాశం. దాంతో వర్మను స్పూర్తిగా తీసుకుని ఆయన దర్శకత్వ శాఖలోకి వెళ్ళాలని ట్రై చేశాడు కుదరలేదు. ఇక లాభం లేదని ఏకలవ్య శిష్యుడిగా ఆయన్నే అనుసరిస్తూ.. ఆయన జీవితంపై ఓ సినిమాను తెరకెక్కించాడు. వర్మ బయోగ్రఫీగా తీశాడు. 
 
చిన్నతనం నుంచి  వర్మ ఎలా వున్నాడు. సినిమాలు ఎలా తీశాడు. క్రైం ఆలోచనలు ఎందుకు వస్తాయి. అనేది చూపించాడు. ఈ చిత్రం రెండేళ్ళనాడు తీశాడు. వర్మ పాత్రను చిన్న శ్రీశైలం యాదవ్‌ కుమారుడు సాయి వెంకట్‌ను పెట్టాడు. ఏదో డబ్బులు తగ్గుతాయనీ, పబ్లిసిటీ ఉపయోగపడుతుందని అనుకున్నాడు. కానీ మధ్యలోనే అతను వెళ్ళిపోవడంతో వాయిదాపడింది. ఆ తర్వాత తెలిసిన కొంతమంది టెక్నీషియన్స్‌ కూడా మోసం చేయడం, నిర్మాతలు కూడా వెనక్కు వెళ్ళిపోవడంతో చేసేదిలేక... 80 లక్షలతో సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తున్నాడు. 
 
ఆ అనుభవంతో ఈ రంగంలో చాలా నేర్చుకున్నాననీ... ఇక్కడంతా మోసగించేవాళ్ళేనని.. మన జాగ్రత్తలో మనం వుండాలనే నీతి గ్రహించానని అంటున్నాడు. మరి ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతుంది. 'నేను నేనే... రామూనే...' అని పేరుపెట్టారు.