బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (14:15 IST)

లింగా ఇన్ 2000 థియేటర్స్: డిసెంబర్ 12న రిలీజ్‌!!

రజినీకాంత్ హీరో నటించిన ''లింగా'' సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. రజినీకాంత్, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లింగ' చిత్రాన్ని డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
 
చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికేట్ ఇచ్చిందని వివరించారు. 
 
తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించిన నేపథ్యంలో.. రజినీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టిలు నటించారు. ఈ సినిమాకు ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు.