గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (09:20 IST)

జోరుగా 'రుద్రమదేవి' పోస్ట్ ప్రొడక్షన్.. విడుదల తేదీ ఖరారు..!

అనుష్క టైటిల్ రోల్ పోషించిన 'రుద్రమదేవి' చిత్రం విడుదల ఎప్పుడు అనే విషయంపై ఇప్పటి వరకు చిత్ర నిర్మాతల నుంచి ఇదమిత్థంగా ప్రకటన రాలేదు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్ర రిలీజ్ ఎప్పుడన్న దానిపై కన్ఫ్యూజన్ చోటుచేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం. కాగా, ఇటీవల ఈ చిత్రం ఆడియో వేడుకను విశాఖ, వరంగల్ పట్టణాలలో రెండు సార్లు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.