బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (15:37 IST)

అనుష్క రుద్రమదేవి రిలీజ్‌కు మార్చిలో ముహూర్తం!

అనుష్క టైటిల్ పాత్రధారిణిగా నటిస్తున్న 'రుద్రమదేవి' సినిమా మార్చిలో విడుదల కానుంది. మార్చి చివరి వారంలో దీనిని రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాత గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు. భారతదేశపు తొలి చారిత్రాత్మక స్టీరియో ఫోనిక్ త్రీడీ చిత్రంగా పేరు తెచ్చుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 
 
ఈ సినిమాలో గ్రాఫిక్ వర్కుకి ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో ఆ విషయంలో ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.