శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 11 మార్చి 2015 (17:11 IST)

'సన్నాఫ్ సత్యమూర్తి'లో బన్నీ స్టైల్ కేక.. సమంత ట్వీట్!

హీరో అల్లు అర్జున్ తాజా చిత్రం 'సన్ ఆఫ్ సత్యమూర్తి'. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లలో అల్లుఅర్జున్ సూపర్‌గా వున్నాడని క్రేజీ బ్యూటీ సమంత ట్విట్ చేసింది. తాను చేసే ప్రతి సినిమాలో డిఫరెంట్ గా, స్టైలిష్ గా, తన మార్కు శైలి కనిపించేలా చూసుకుంటాడు బన్నీ.
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తాజాగా విడుదలయ్యాయి. ఈ పోస్టర్స్ లో అల్లు అర్జున్ చాలా స్టైలిష్‌గా, వెరైటీగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన సమంత, అధాశర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ఈ సినిమాని హారిక & హాసిని పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మార్చి 15 ఆడియో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా ఈవెంట్ ఆర్గనైజర్ పాత్రలో నటిస్తున్నారు. 'సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ సుపర్బ్ గా ఉన్నాడని సమంత ట్విట్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ రెండో తేదిన విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.