గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Ganesh
Last Updated : మంగళవారం, 1 జులై 2014 (13:18 IST)

సమంత డ్రెస్ కాపీ అంటూ కథనం.. ట్విట్టర్‌లో సమంత ఫైర్!

టాలీవుడ్ క్రేజీ స్టార్ సమంత ఓ ఇంగ్లిష్ డైలీపై ఫైర్ అయింది. ఇటీవల జరిగిన అల్లుడు శ్రీను ఆడియో ఫంక్షన్‌కు సమంత క్వీన్ గెటప్‌లో డ్రెస్ వేసుకుని వచ్చింది. ఆ డ్రెస్‌లో సమంత ఆడియో ఫంక్షన్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే సమంత తన డ్రెస్సింగ్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్‌లను కాపీ కొడుతుందని మీడియాలో కథనాలు వచ్చాయి.

టీవోఐ అనే ఆంగ్ల దినపత్రిక సమంత ఈవెంట్స్‌కు వేసుకున్న మోడలింగ్ డ్రెస్‌లన్నీ బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, సోనమ్ కపూర్  వేసుకున్నవే అని కథనం ప్రచురించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సమంత సదరు దినపత్రికపై తన ట్విట్టర్‌లో ఫైర్ అయింది. తన ట్విట్టర్‌లో దీనిపై సమాధానం చెప్పింది.

టీవోఐ లాంటి జాతీయ పత్రిక ఇలాంటి కథనాలు ప్రచురించడం సరికాదని ఆమె ట్విట్టర్లో పేర్కొంది. డిజైనర్లు సీజన్‌కు నప్పేలా ఒకే కలర్లో కొన్ని దుస్తులను డిజైన్ చేస్తారని, అవి అన్ని దుకాణాల్లోనూ, ఆన్‌లైన్ లోనూ లభిస్తాయని సమంత వివరించారు. అవి కేవలం ఏ ఒక్కరి కోసమే తయారుచేయరని, అందరూ వాటిని ధరించవచ్చని వివరించారు. తానూ అలాంటి డిజైనర్ దుస్తులనే ధరించానని, అలాంటప్పుడు తాను ఎవరినో కాపీ కొట్టినట్టు ఎలా అవుతుందని సమంత సదరు పత్రికను ప్రశ్నించింది.