గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:16 IST)

పెండ్లి కాకుండా తల్లినైపోతుందట.. సమంత నీకేం పోయేకాలం!!

పెండ్లి కాకుండా తల్లినైపోతానని సమంత చెబుతోందట. అంతే ఆమె ఫ్యాన్స్ నీకేం పోయేకాలం అంటూ తిట్టుకుంటున్నారట. టాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా రాణిస్తున్న సమంత పెళ్లి చేసుకుని పద్ధతిగా ఉండాల్సిందిపోయి... ఇలా పెళ్లికాక ముందే తల్లినైపోతానని చెప్పడంపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ మధ్య నటీమణులు ఒక ఏజ్‌వచ్చాక.. పెండ్లిచేసుకోవాలనుకుంటారు. చాలా మంది మాత్రం.. ఇంకా పెండ్లి వయస్సురాలేదని చెబుతుంటారు. కానీ నటి సమంత ఇందుకు మినహాయింపుగా కన్పిస్తుంది. తను తల్లికావాలనుకుంటున్నట్లు ట్విట్టర్‌లో చెప్పేసింది. 
 
గతంలో సిద్ధార్థ్‌తో కలిసి పెండ్లిదాకా వెళ్ళిన ఈ భామకు.. ఇప్పుడు తల్లికావాలనుకునే కోరిక కలిగింది. ఏజ్‌ బార్‌ అయ్యాక.. తల్లయితే... పిల్లలకు తల్లిగా దక్కాల్సిన సౌకర్యాలు చేయలేమోనని అనుమానం వ్యక్తం చేస్తుంది. 
 
అయితే.. కొంతమంది అనాధలన్ని పెంచుకుంటారు. కానీ అదికాదని ఒరిజినల్‌గా తల్లికావాలంటోంది.. మరి ఆ హీరో ఎవరో వెయిట్ చేసి చూద్దాం..!