శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (10:32 IST)

గుడ్డిగా నమ్మేసింది.. ముంచుతాడో, తేలుస్తాడో..!

వెండితెరపై వెలిగే ఏ హీరో, హీరోయిన్ అయినా సరే ఒక సినిమాలో నటించేందుకు అంగీకరించే ముందు తప్పకుండా కథ వింటారు. కొందరైతే కథలో తమ పాత్రకున్న ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నాకే నటించేందుకు అంగీకరిస్తారు.
 
అయితే, ఇందుకు భిన్నంగా అందాలతార సమంతా మాత్రం తాజాగా కథ కానీ, తన పాత్ర కానీ ఏమీ అడక్కుండానే ఓ సినిమా ఒప్పేసుకుంది. అదే, విక్రం హీరోగా నటిస్తున్న 'పత్తు ఎండ్రాదు కుళే'! తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
ఈ దర్శకుడు ఇంతకుముందు బాలనటీనటులతో తీసిన 'గోలీసోడా' సినిమా సమంతాకి బాగా నచ్చేసింది. అందుకే, ఆయన సినిమాలో నటించే ఛాన్స్ అనగానే, అతని మీద నమ్మకంతో, అసలు కథే అడగలేదట. ఈ విషయం గురించి సమంతను అడిగితే, ఆయన్ను గుడ్డిగా నమ్మేశాను.. ముంచుతాడో, తేలుస్తాడో.. అంతా ఆయన ఇష్టమే అంటూ వయ్యారాలు ఒలకబోస్తోంది సమంత.