శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 22 సెప్టెంబరు 2014 (15:05 IST)

నన్ను పెళ్లాడుతానంటే నేను రెడీ... సమంత

తెలుగు సినిమాల్లోకి వచ్చాక.. సమంత చాలా మాటలు నేర్చుకుంది. తమిళంలో కూడా ఆమె నటిస్తోంది. ఇటీవలే మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌తో సమంత 'కత్తి' అనే సినిమాలో నటించింది. ఆడియో కూడా విడుదలైంది. అక్కడ చిత్రంలో నటించిన కమేడియన్‌ సతీష్‌ కూడా పాల్గొన్నాడు. 
 
కమేడియన్లు ఏవో పంచ్‌ డైలాగ్‌లు చెప్పి నవ్విస్తుంటారు. అలాగే... తను మాట్లాడుతూ... సమంత లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుందంటూ తెలిపాడు. అంటే డైరెక్ట్‌గా ఆమెనే చేసుకుంటానంటే.. వివాదం అవుతుందనుకున్నాడు. దానికి వెంటనే సమంత స్పందిస్తూ.. సతీష్‌ను చేసుకోవడానికి రెడీ.. అంటూ ఠక్కున అనేసింది. ఈ విషయం సిద్దార్థ్‌కు తెలిసే వుంటుంది. చాలా క్యాజువల్‌గా తీసుకుంటాడులెండి. ఆర్టిస్టుల మాటలు ఇలా వుంటాయి మరి.