మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (15:42 IST)

వామ్మో టాలీవుడ్‌ను వదిలివేస్తే నా కెరీర్ ఏంకావాలి: సమంత

టాలీవుడ్‌ కెరీర్‌పై హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైతే నా కెరీర్ ఏం కావాలని ప్రశ్నించింది. అందువల్ల తెలుగు సినిమాను వదిలేసేది లేదని స్పష్టం చేసింది. అలాగే, తమిళ సినిమాను కూడా వదలనని చెబుతోంది.
 
ఈ రెండు పరిశ్రమలు తనకు ముఖ్యమేనని చెప్పింది. 'తెలుగు, తమిళంలో సమానంగా సినిమాలు చేస్తున్నాను. ఇక్కడ రెండు చేస్తే అక్కడ రెండు చేస్తున్నాను. టాలీవుడ్, కోలీవుడ్ ఈ రెండూ కూడా నాకు కావాలి' అని అంటోంది.
 
ఇలా రెండు భాషల్లోనూ చేయడం వల్ల ఇబ్బంది కూడా లేదని చెప్పింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ... ఇలా నాలుగు భాషలలోను ఒకేసారి చేస్తే కనుక ఇబ్బంది అవుతుంది. రెండు భాషల వల్ల ఏ సమస్యా రాదు అని ఈ బ్యూటీ సెలవిస్తోంది.