బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (12:45 IST)

సమంత మళ్లీ విజయ్.. ఎమీ జాక్సన్ కూడా...!

తమిళ హీరో విజయ్ సరసన కథానాయికగా సమంతా మరో సూపర్ ఛాన్స్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ హీరోతో కలసి ఈ చెన్నై చిన్నది 'కత్తి' సినిమాలో నటించిన సంగతీ, అది పెద్ద హిట్టయిన విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలో అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ నటించనున్న చిత్రానికి గాను ఈ ముద్దుగుమ్మనే ఎంచుకున్నారట. మొదట్లో నయనతార అనుకుంటే, ఆమె డేట్స్ లేవంటూ 'నో' చెప్పడంతో చివరికి సమంతానే తీసుకుంటున్నట్టు చెన్నై సమాచారం. ఇందులో మరో భామగా ఎమీ జాక్సన్ నటిస్తుంది.