శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (12:26 IST)

సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ మృతి!

సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల‌జీజ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియా వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం మృతి చెందినట్టు వైద్యులు వెల్లించారు. ప్రపంచంలోనే చమురు ఎగుమతి చేసే వ్యక్తుల్లో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన అబ్దుల్లా న్యుమోనియా కారణంగా మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
అబ్దుల్లా మరణం నేపథ్యంలో ఆయన సోదరుడు సల్మాన్, సౌదీకి నూతన రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. న్యుమోనియాతో బాధపతుడుతున్న అబ్దుల్లా, గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అంటే ఒంటి గంట సమయంలో మరణించినట్లు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 1923లో జన్మించిన అబ్దుల్లా, 2006 నుంచి సౌదీ అరేబియా రాజుగా కొనసాగుతున్నారు. 
 
అనారోగ్యం కారణంగా గత నెల 30వ తేదీన ఆస్పత్రిలో చేరిన ఈయన.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయన 2005లో సౌదీ రాజుగా అధికార పగ్గాలు చేపట్టి దాదాపు దశాబ్ద కాలం పాటు తిరుగులేని రాజుగా అవతరించారు.