గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (17:16 IST)

యాంకర్‌పై వేధింపులు.. సీరియళ్ల నిర్మాత అరెస్టు..!

వెండితెరపై వెలిగే హీరోయిన్ల సంగతి ఎలా ఉన్నా, బుల్లి తెరపై కనిపించే బ్యూటీలు, సీరియళ్లలో నటించే ఆర్టిస్టులు, యాంకర్ల పై వేధింపులు షరా మాములైపోయాయి. ఇలాంటి ఘనకార్యమే చేసిన టీవీ సీరియళ్లు తీసే ఓ నిర్మాతను హైదరాబాద్ లోని సంజీవరెడ్డి నగర్ పోలీసులు అరెస్టు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న మహిళ సదరు నిర్మాత తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీవీ సీరియళ్లు తీసే ఓ నిర్మాతను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఒక ప్రైవేటు టీవీ ఛానల్లో యాంకర్‌గా పని చేస్తున్న ఆ మహిళా యాంకర్‌ను రోజు ఆ నిర్మాత వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి బోరున విలపించింది. పోలీసులు ఆ నిర్మాత వద్ద విచారణ జరుపుతున్నారు. కాగా ఈ కేసు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.