శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: శనివారం, 19 జులై 2014 (18:29 IST)

ఆ సెక్స్ సీన్‌లు పాలిష్ చేసి చూపిస్తాం.. సునీల్‌ కుమార్‌ రెడ్డి

'గంగపుత్రులు', 'సొంత వూరు' చిత్రాల్లో వేశ్య పాత్రలూ ఉన్నాయి. కానీ వాటి పరిధి మేరకే చూపించాను. 'ఒక క్రిమినల్‌ ప్రేమకథ'లో ఇంట్లోనూ ఇంటి చుట్టుప్రక్కలా జరుగుతున్న మహిళల వేధింపులను తెరకెక్కించానని చిత్ర దర్శకుడు పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు.
 
ఎక్కడో ఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగితే దేశమంతా గొడవ చేసింది. ప్రతిచోటా కొవ్వుత్తుల ప్రదర్శన నిర్వహించింది. కానీ.. మనచుట్టూ జరుగుతున్న సంఘటల్ని తేలిగ్గా తీసుకుని.. అసలు అవి కామనే అంటూ సర్దుకుపోయే సమాజం ఉన్నంతకాలం మహిళలపై వేధింపులు, అరాచకాలు జరుగుతుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి భయపడతారు.
 
ఇదే నేను సినిమాలో చూపించాను. ఇలా వేధింపులు చేసే తండ్రులు, అంకుల్స్‌కు ఓ హెచ్చరికలా నా సినిమా ఉంటుంది. ఈ సినిమాను కుటుంబంతో చూడ్డానికి భయపడుతున్నారనే ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ... మూడు చోట్ల.. సెక్స్‌ జరిగే సన్నివేశాల ఫీలింగ్స్‌ చూపించాను. ఇది నేను కొత్తగా చూపించలేదు. జరిగేది చూపించాను. 
 
దీన్ని సెన్సార్‌ అధ్యక్షురాలు ధనలక్ష్మీ కూడా అంగీకరించారు. మంచి కథను తీసుకున్నారని మెచ్చుకున్నారంటూ ఆయన వివరణ ఇచ్చారు. ఆదివారం నుంచి అభ్యంతరకరంగా ఉండే ఆ మూడ్‌ సీన్స్‌ స్థానంలో పాలిష్‌గా ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకుంటామని.. అటువంటి సీన్స్‌ తొలగిస్తామని సునీల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.