గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (12:24 IST)

షారూఖ్ ఖాన్‌తో మళ్లీ ఐశ్వర్యారాయ్.. అభిమానులకు పండగే!

బాలీవుడ్‌లో 'మొహబతీన్', 'దేవదాసు' సినిమాలు ఎంత సూపర్ హిట్టో తెలిసిందే. ఆ చిత్రాల్లో షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్ జంట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలసి నటించింది లేదు. అయితే, ఆ జంట మళ్లీ కలసి నటించబోతుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్. దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది. 
 
ఇప్పటికే షారుక్ తన తదుపరి సినిమా రోహిత్‌తో చేయనున్నాడన్న విషయం ఎప్పుడో ఖరారైంది. ప్రస్తుతం అందులో కథానాయిక కోసం దర్శకుడు చర్చలు జరుపుతున్నాడు. తొలుత కాజోల్‌ను ఈ ప్రాజెక్టుకు అనుకున్నా, ఇప్పుడు ఐశ్వర్యను సంప్రదించాడని అంటున్నారు. ఒకవేళ షారుక్ సరసన ఐష్ ఓకే అయితే అభిమానులకు పండగే!