గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (10:44 IST)

షారుక్ ఖాన్ మోకాలికి శస్త్రచికిత్స... నాలుగు రోజులు విశ్రాంతి

గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ముంబైలోని బ్రీంచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేశారు. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. కొన్ని నెలలుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న షారుక్ ఇటీవల ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. 
 
దీంతో ఆయన కాలి నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. దీంతో ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయన పరిస్థితి మామూలుగానే ఉందని, శనివారం డిశ్చార్జి చేయవచ్చని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా షారుక్ ట్వీట్ చేస్తూ తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.