అర్పితా రిసెప్షన్లో సల్మాన్-షారూఖ్ ఛయ్యా.. ఛయ్యా.. డ్యాన్స్!
సల్మాన్ ఖాన్- షారూఖ్ ఖాన్‌లను అర్పిత వివాహం కలిపేసింది. అనుకోని విధంగా కలసిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లు అర్పితాఖాన్ వివాహం సందర్భంగా తెగ ఎంజాయ్ చేశారు. ముందు అర్పితా సంగీత్‌లో గంటలు గంటలు మాట్లాడుకున్న సల్లూ.. షారూఖ్, తాజాగా అర్పితా వివాహ రిసెప్షన్లో కలసి డాన్స్ చేశారట.
బాంద్రాలోని తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్లో అర్పితా, ఆయుష్‌ల రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. షారుక్ సహా బాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'దిల్ సే' చిత్రంలోని 'ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా...' వంటా పలు ఫాస్ట్ బీట్ పాటలకు సల్లూ, షారుక్ డాన్స్ చేశారట.