బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2014 (13:35 IST)

'ఐ' రికార్డుల పరంపర... యూ ట్యూబ్‌లో సరికొత్త రికార్డు..!

సియాన్ విక్రమ్, ఎమీ జాక్సన్లు హీరో హీరోయిన్లుగా, ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న 'ఐ' చిత్రం విడుదలకు ముందుగానే పలు రకాలుగా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం తన ఖాతాలో మరో కొత్త రికార్డును జమచేసుకుంది. 
 
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 'యూ ట్యూబ్'లో ఇప్పటి వరకు 9 మిలియన్ (90 లక్షలు) వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును చేజిక్కించుకుంది.
 
తద్వారా దక్షిణాది చిత్రాలలో ఇన్ని వ్యూస్ పొందిన మరో సినిమా ఇప్పటి వరకు లేకపోవడం విశేషం. దీనిని బట్టి ఈ చిత్రానికి ఎంతటి క్రేజ్ వుందో అర్థమవుతోంది.