శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (17:37 IST)

పచ్చ కామెర్లకు చెన్నైలో ట్రీట్మెంట్ : శాంతి శ్రీహరి వెల్లడి

తనకు పచ్చ కామెర్లు సోకాయని, అందువల్ల చెన్నైలోని తన సోదరి నివాసంలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు దివంగత నటుడు శ్రీహరి భార్య, నటి శాంతి చెప్పారు. పైగా, వీటి వల్ల తాను తీవ్రమైన అనారోగ్యానికి గురికాలేదని వివరణ ఇచ్చారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. 
 
తన ఆరోగ్యం బాగాలేనిమాట వాస్తవమేగానీ, తాను విషమ పరిస్థితుల్లో లేనని ఆమె వివరణ ఇచ్చారు. తాను ప్రస్తుతం పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నానని, ప్రస్తుతం చెన్నైలోని తనసోదరి లలితకుమారి (ప్రకాష్ రాజ్ మాజీ భార్య) నివాసంలో ఉంటూ కామెర్లకి చికిత్స పొందుతున్నానని ఆమె వివరించారు. 
 
చెన్నైలో చికిత్స తర్వాత తాను కోలుకున్నానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే వున్నానని శాంతి శ్రీహరి తెలిపారు. పచ్చకామెర్లు వచ్చిన తర్వాత డాక్టర్లు నాన్‌వెజ్ తినొద్దని చెప్పగా తాను పెడచెవిన పెట్టడమే అసలు సమస్యకు కారణమని ఆమె వివరణ ఇచ్చారు.