శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (18:33 IST)

మాజీ ప్రియుడితో నయనతార పెళ్లి.. పోస్టర్ల కలకలం..!

వెండితెరపై వెలిగే అందాల తార నయనతారకు మాజీ ప్రియుడు శింబుతో పెళ్లి అయిపోయింది అని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి పెళ్లి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. 
 
అది వీరికి నిజం పెళ్లైతే బాగుండు అని అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పెళ్లి ఫోటోలు నిజమైన పెళ్లి ఫోటోలు కావు. వీరిద్దరూ కలసి తాజాగా నటిస్తున్న 'ఇదు నమ్మ ఆలూ' సినిమాలోని స్టిల్స్. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో వీరిద్దరికి పెళ్లి జరుగుతుంది. 
 
ఆ పెళ్లి ఫోతోలనే దర్శకనిర్మాతలు పబ్లిసిటీకి ఉపయోగించుకున్నారు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని సిలంబరసన్ నిర్మిస్తున్నారు.