శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (12:32 IST)

హెయిర్ స్టయిల్ మార్చేసిన సోనాక్షి సిన్హా!: ఏ సినిమా కోసమో?

లింగా సినిమాలో తన పార్ట్ ఆఫ్ షూటింగ్ పూర్తవడంతో.. గబ్బర్ సింగ్ భామ సోనాక్షి సిన్హా.. హెయిర్ స్టయిల్ శుభ్రంగా మార్చేసింది. సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు స్టయిల్ మారిస్తేనే ఫ్యాషన్.. ఇందులో హీరోయిన్లే ముందుంటారు.
 
తాజాగా బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తన హెయిర్ స్టయిల్ మార్చింది. హెయిర్‌ను షార్ట్ కట్ చేయించింది. భుజాల వరకు ఉండే ఆ కొత్త లుక్ తో తీసిన ఫోటోను ట్విట్టర్‌లో పెట్టి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. 
 
"హెయిర్ టుడే, గాన్ టుమారో! షార్ట్ హెయిర్!!! ఆఫ్టర్ ఇయర్స్! ఎగ్జైట్ అవుతున్నాను" అంటూ సోను పోస్టు చేసింది. ఎప్పుడూ బొద్దుగా, ముద్దుగా, పొడవాటి జుట్టుతో కనిపించే సొనాక్షి సడన్‌గా ఈ కొత్త లుక్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. మరీ స్టైల్ ఏ సినిమా కోసమనేది చెప్పలేదు.