బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 25 అక్టోబరు 2014 (19:18 IST)

తెలుగువారికి బక్కగా ఉండాలి.... తమిళవారికి లావైనా పర్లేదు...

దక్షిణాదిలోని చిత్రాల్లో నటించాలంటే.. తెలుగులో నాజూగ్గా వుంటేనే ఆడియన్స్‌ ఆదరిస్తారట. అదే ఇతర భాషల్లో అయితే కాస్త లావున్నా పెద్దగా పట్టించుకోరని.. పెర్‌ఫార్మెన్స్‌ చూస్తారని హన్సిక, శ్రుతి హాసన్‌ చెబుతున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వారు మాట్లాడారు. 
 
తొలిదశలో నేను ఎంతో నాజూగ్గా వుండేదాన్ని, తెలుగు ప్రేక్షకులు బాగా ఎంకరేజ్‌ చేశారు. దాన్ని మెయిన్‌టైన్ అవుతూ.. గబ్బర్‌ సింగ్‌ చేశాను. అక్కడ ఏమాత్రం లావు అయినా... సీన్‌ పండేది కాదు.. ఆ సినిమాకు దర్శకుడు కూడా పరిమితంగా ఆహారాన్ని తీసుకోవాలని చెనప్పాడని అంది.
 
ఇదే విషయాన్ని హన్సిక చెబుతూ.... అప్పట్లో కాస్త బరువు తగ్గే ప్రయత్నం చేశా. కేవలం ఆరోగ్యం కోసమే. ఇప్పుడు ఎక్కువ లావు వున్నానంటున్నారు. తమిళంలో ఇలాంటి పేచీ లేదని చెబుతోంది.