శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 27 జూన్ 2015 (12:09 IST)

సెక్సీ రేసుగుర్రం శృతి బెస్ట్ ఏక్ట్రెస్.. ఫిలిమ్‌ఫేర్ అవార్డు... తండ్రి కమల్‌తో సెల్ఫీ ఆనందం...

నిన్న రాత్రి చెన్నైలో జరిగిన ఫిలిమ్‌ఫేర్ అవార్డుల్లో సెక్సీ నటి శృతి హాసన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. శృతి హాసన్ తో పాటుగా కాజల్ అగర్వాల్, శ్రేయ వంటి సెక్సీ నటీమణులకు ఏదైనా అవకాశం ఉంటుందేమోనని అనుకున్నారు కానీ చిట్టచివరికి శృతి హాసన్ ఈ అవార్డును ఎగరేసుకుని వెళ్లింది. 
 
గతంలో బెస్ట్ డెబ్యూగా ఫిలిమ్‌ఫేర్ అవార్డు అందుకున్న శృతి హాసన్ ఇప్పుడు ఏకంగా ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఉత్తమ చిత్రంగా నాగార్జున, అక్కినేని నాగేశ్వర రావు, చైతన్య నటించిన మనం చిత్రం అవార్డు దక్కించుకుంది.