గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 జులై 2014 (17:10 IST)

శృతిహాసన్-తమన్నా లిప్ లాక్.. కౌగిలింతలు అబ్బబబ్బా!

ఇప్పటి వరకు హీరో హీరోయిన్స్ లిప్ లాక్ సీన్స్ చూసుంటాం. అవి హాట్ టాపిక్ అయిన విషయాలను వినేవుంటాం. అయితే హీరోయిన్స్ మధ్య లిప్ లాక్ సీన్ చూశారా.? ఇదేంటని అవాక్కయ్యారా? అయితే ఈ స్టోరీ చదవండి. ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగాన్ని ఏలుతున్న ఇద్దరు గ్లామర్ బ్యూటీలు ఒక ప్రైవేటు పార్టీలో ఒకరినొకరు కౌగలించుకుని బహిరంగంగా లిప్ లాక్ చేసుకున్నారు అనే వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
 
ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రైవేటు పార్టీకి హాజరు అయిన తమన్నా, శ్రుతిహాసన్‌లు ఆ పార్టీని బాగా ఎంజాయ్ చేయడమే కాకుండా ఇద్దరూ అందరు చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో కౌగింతలు, లిప్ లాక్‌ల్లో మునిగిపోయారట. అంతేకాదు ఆ తరువాత వారు ఎవర్నీ పట్టించుకోకుండా సుదీర్ఘ సంబాషణల్లో మునిగిపోయినట్టు తెలిస్తోంది. 
 
ఈ ఆనందాన్ని మరిచిపోలేక మిల్కీ బ్యూటీ తమన్నా చెన్నైలో శృతి హసన్‌తో గడపడం చాలా బాగుంది అని తమన్నా ట్విట్ చేసింది. ఈ ఫోటోలు కోలీవుడ్ మీడియాకు లీక్ అవ్వడంతో చెన్నైలోని చాలామంది మొబైల్స్‌లోనే ఈ సీన్స్ చూసేస్తున్నారట. కాగా శృతిహాసన్, తమన్నా కలిసి ప్రస్తుతం మహేష్ బాబు ఆగడు చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, శృతిహాసన్ ఐటమ్ గర్ల్‌గా చిందేయనుంది.