గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (12:20 IST)

మహేష్ సినిమా నుంచి తప్పుకున్నానా? ఎప్పుడు?: శృతిహాసన్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమా నుంచి తప్పుకున్నానా? ఎప్పుడు? అని గబ్బర్ సింగ్ భామ శృతిహాసన్ అడుగుతోంది. డేట్స్ సమస్య వల్ల మహేష్ బాబు సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకుందంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో.. శృతి స్పందించింది. 
 
విజయ్‌తో చేస్తున్న తమిళ సినిమా డేట్స్ క్లాష్ రావడం వల్ల మహేష్ సినిమాని శృతి  వదిలేసిందని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ వార్తల్ని చిత్ర దర్శకుడు కొరటాల శివ ఖండించాడు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నాడు.
 
"ఆ వార్తలు ఎలా వస్తున్నాయో నాకు తెలియడం లేదు. ఇటీవలే పూణే షెడ్యూల్‌లో శృతి పాల్గొంది. డిసెంబర్ 10 నుంచి జరిగే తదుపరి షెడ్యూలులో పాల్గొనడానికి కూడా డేట్స్ ఇచ్చింది. ఇదంతా జస్ట్ రూమర్. మహేష్ అభిమానులు వీటిని నమ్మద్దు" అంటూ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు శివ. అలాగే శృతి కూడా మహేష్ సినిమాపై వస్తున్న రూమర్స్‌ను ఖండించింది.