బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (17:20 IST)

మళ్ళీ కెమెరా ముందుకు శ్వేతాబసు.. హన్సల్ మెహతా ఛాన్స్..!

సంచలనాల హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ మళ్లీ కెమెరాముందుకు వస్తోంది. ఓ హోటల్లో దొరికిన ఆమెపై పోలీసులు వ్యభిచారం కేసు పెట్టి రెస్క్యూహోంకు పంపడం, కోర్టు జోక్యం చేసుకుని ఆమెను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించడం తెలిసిందే. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్పట్లోనే శ్వేతాబసు చెప్పింది.
 
మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్లీ ఆమె ముఖానికి రంగేసుకుని ఓ డాక్యుమెంటరీతో కెమెరా ముందుకు రాబోతోంది. జాతీయ అవార్డు విజేత హన్సల్ మెహతా తన స్వీయ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఇందులో శ్వేతాబసుకు అతి కీలకపాత్ర ఇచ్చినట్లు సమాచారం. 
 
త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. రెస్క్యూహోం నుంచి విడుదలై బయటకు వచ్చినప్పుడే, తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని శ్వేతాబసు తెలిపింది. ఆ ప్రకారంలో మెహతా ఇచ్చిన అవకాశాన్ని శ్వేతా అందిపుచ్చుకుంది.