శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 19 ఆగస్టు 2014 (15:40 IST)

సికిందర్‌ సింకయ్యాడట... లవర్స్ కు లక్ తగల్లేదట...

తమిళస్టార్‌ సూర్య నటించిన 'సికిందర్‌' చిత్రం తెలుగులో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రొటీన్‌ కథలా అనిపించడంతోపాటు అందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ పాళ్ళు చాలా తక్కువగా వున్నాయి. బ్రహ్మానందం పాత్ర కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. లింగుస్వామి... బ్రహ్మానందం సీన్స్‌ను కట్‌ చేశాడట. దాదాపు మూడు గంటలపాటు లెంగ్త్‌ వున్న ఈ సినిమాను కామెడీ సన్నివేశాలు తగ్గించాడు. 
 
బ్రహ్మానందం వున్నా వుపయోగలేకుండా పోయింది. కాగా, మారుతీ దర్శకత్వం వహించిన 'లవర్స్‌' సినిమా క్లాస్‌ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. బి,సి. వర్గాల్లో పెద్దగా కలెక్షన్లు లేవు. నిన్న, మొన్న మాత్రం యాభై శాతం కలెక్షన్లు వున్నాయని నిర్వాహకులే చెబుతున్నారు. మారుతీ హవా నిదానంగా పడిపోతుంది. చెప్పిన పాయింట్‌నే చెబుతూ.. కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.  అయితే ఇందులో కామెడీ నటులు కొత్తవారు కావడంతో కాస్త రిలీఫ్‌గా అనిపించిందని తెలుస్తోంది.