బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2015 (11:17 IST)

సిమ్రాన్ కొత్త అవతారం... దర్శక నిర్మాతగా దర్శనం..!

వెండితెరపై వెలిగే అందాల భామలు పెళ్లి, పిల్లలు అంటూ దూరమైనా కొంత కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ అవుతుంటారు. ఆ కోవలో రీఎంట్రీ అయిన అందాల తార సిమ్రాన్. నిన్నటితరం ప్రేక్షకులను తన అందచందాలతో అలరించిన సిమ్రాన్ ఈ సారి కొత్త అవతారం ఎత్తింది. నిర్మాతగా, దర్శకురాలిగా కొనసాగడానికి నిర్ణయం తీసుకుంది. 
 
తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసింది. ఈ నిర్మాణ సంస్థ పేరు 'సిమ్రాన్ అండ్ సన్స్'. దీనికి సంబంధించిన లోగో ఆవిష్కరణని ఈ రోజు చెన్నయ్ లో నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "నాకు సినిమా అంటే ప్రాణం. అందుకే, ఇదే రంగంలో కొనసాగాలని నిశ్చయించుకున్నాను. ఈ ఏడాది రెండు సినిమాలు నిర్మిస్తాను. అందుకు సంబంధించిన విశేషాలను త్వరలో వెల్లడిస్తాను" అని అంటోంది. మరి సక్సెస్ కొడుతుందేమో చూడాలి.