శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:45 IST)

అబ్బే... సల్మాన్ నన్ను అలా కొట్టలేదు... మాజీ ప్రేయసి బయోగ్రఫీ

సల్మాన్‌ ఖాన్‌ అంటేనే హీరోయిన్లకు క్రేజ్‌. నటుడిగా కొత్తగా ఇండస్ట్రీలో ప్రవేశించినపుడు ఆయనతో డేటింగ్‌ చేసేందుకు పలువురు భామలు ఆసక్తి చూపేవారు. 1990లో ఆయనతో పలు చిత్రాల్లో నటించిన సోమీ అలీ తాజాగా మళ్ళీ తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌లో నటించినా పెద్దగా క్రేజ్‌ రాలేదు కానీ.. ఆయనతో డేటింగ్‌ చేసినప్పుడు పెద్ద ఫేమ్‌ అయింది. కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా సల్మాన్ తో తనకు పరిచయం కావడం... 8 ఏళ్ళు డేటింగ్‌ చేసిన తర్వాత 1999-200లో విడిపోయానని అంటోంది. ఇంతకీ ఈ విషయాలను ఆమె ఎందుకు చెబుతుందంటే... ఆమె బయోగ్రఫీ రాస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ఈమె నటన తర్వాత ఫ్లోరిడాలో 'నో మోర్‌ టియర్స్‌' అనే ఎన్‌జిఓ సంస్థను స్థాపించింది. 
 
ఆ సంస్థ 8వ వార్షికోత్సవం ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా ఆమె ముంబై వచ్చింది. ఆమె రాసిన బయోగ్రఫీలో.. తాను 5 ఏళ్ళ వయస్సులో కుటుంబ స్నేహితుల వల్ల సెక్స్‌వల్‌ హరాస్‌మెంట్‌కు గురయినట్లు పేర్కొంది. అంతేకాకుండా.. సల్మాన్‌తో రిలేషన్‌షిప్‌ వున్నప్పుడు కోలా బాటిల్‌తో గాయపర్చాడనే వార్తలు వచ్చాయిగా అని అడిగితే... అదంతా పుకారే.. ఎలా వచ్చిందో తెలీదు. సల్మాన్‌ ఆల్కహాల్‌ తాగడం ఇష్టం లేక బాటిల్‌ను టేబుల్‌పై విసిరేసినట్లు పేర్కొంది. ఇలాంటి ఎన్నో చిత్రాలు ఇందులో వున్నాయంటోంది. త్వరలో అది మార్కెట్‌లోకి రానుంది. మరి దీనికి సల్మాన్‌ ఏమంటాడో చూడాలి.