గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (11:53 IST)

కారులో కూర్చుని తాటాకు పట్టుకుని కల్లు తాగిన సంజన!

ఓ తాటాకును పట్టుకొని దానిలో కల్లు పోయించుకుని తాగుతూ హీరోయిన్ సంజన కెమెరాకు చిక్కింది. కారులో కూర్చుని ఓ తాటాకుతో కల్లు తాగిన దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. 
 
సంజన ‘బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. కల్లు ఎంతో ఇష్టంగా తాగుతున్నట్లు ఆ ఫొటోను చూస్తే తెలుస్తోంది.
 
సహజసిద్ధంగా చెట్టు నుండి సేకరించే కల్లు కాబట్టి తాగితే ఆరోగ్యానికి మంచిదే అని అమ్మడు తన స్నేహితులతో చెబుతోందట కూడా. ప్రస్తుతం సంజన తెలుగులో శివ కేశవ్, వన్స్ అపానే టైం, సరదా, అవును-2 చిత్రాల్లో నటిస్తోంది.