శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (19:52 IST)

సెన్సారైన 'శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి..' త్వరలో రిలీజ్!

జైభవాని ప్రొడక్షన్స్‌, శివభవానీ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర'. విశ్వమాత ఉపశీర్షిక. శ్రీపాద రామంచంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు జె.ఆర్‌. పద్మిని, కోంపల్లి చంద్రశేఖర్‌, కాసరగొట్టు రాజశేఖర్‌ గుప్త వెల్లడించారు.
 
చిత్రం గురించి వారు చెబుతూ... విశ్వమాత మహిమలు, భక్తుల కోరికలు ఎలా నెరవేరాయి అనే అంశాలను ఇందులో చూపిస్తున్నాం. సినిమా సంతృప్తిపరంగా వచ్చిందని తెలిపారు. భక్తిప్రదానమై ఈ చిత్రం నేటితరాన్ని సైతం అలరిస్తుందనే నమ్మకముందని దర్శకుడు పేర్కొన్నారు. ఇందులో పార్వతి దేవిగా రమ్యకృష్ణ, అమ్మవారిగా సందీప్తి నటించారు. ఈ చిత్రానికి సంగీతం: వాసూరావు, సాహిత్యం: సినారె, వెనిగళ్ళ రాంబాబు, ఆర్‌.కె.రాము.