శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
Written By Ganesh
Last Updated : శుక్రవారం, 6 జూన్ 2014 (17:45 IST)

మెగా హీరో షూటింగ్ కష్టాలు.. ఎండలో అలసిపోతున్న వరుణ్ తేజ్!

వెండితెరకు పరిచయం కాబోతున్న మెగాబ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం భీమవరంలో జరుగుతోంది. అక్కడ ఎండలు మండిపోవడంతో వరుణ్ అలసిపోతున్నాడట. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమా టైటిల్‌గా 'గొల్లభామ' అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ సరసన పూజా హేగ్డే నటిస్తోంది. ఈ సినిమాను ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జి, నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా వరణ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. భీమవరంలో షూట్ చేస్తున్నాం, ఇక్కడ వేడి అందరినీ చంపేస్తుంది. త్వరగా చలి పలకరిస్తుంది అని ఆశిద్దాం అంటూ ట్వీట్ చేశాడు. వీరి కష్టం వృధాకాకుండా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఘనవిజయం సాధించాలని ఆశిద్దాం.