మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 7 అక్టోబరు 2014 (20:38 IST)

పోలీస్‌...టీచర్‌గా మారితే...?

శ్రీకాంత్‌ హీరోగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శక నిర్మాతగా రూపొందిన చిత్రం 'ఢీ అంటే ఢీ'. ఈ చిత్రం నెలాఖరుకు విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ... ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన భూపతిరాజా కథతో, జొన్నలగడ్డ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ముత్యాల సుబ్బయ్యగారి దగ్గర అసిస్టెంట్‌గా వున్నప్పుడే శ్రీనుతో పరిచయముంది. అతనిపై నమ్మకంతో సినిమా చేశాను. 
 
పూర్తి వినోదభరితంగా తెరకెక్కించాడు. ప్రేమ్‌రక్షిత్‌ నృత్యదర్శకత్వం వహించారు. ఇందులో బ్రహ్మానందం పాత్ర హైలైట్‌గా వుంటుంది. అదేవిధంగా ఆయన చేసే గేమ్‌ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుంది. పంజాబీ నటి సోనియా తెలుగులో పరిచయమవుతుంది.ఒక పోలీస్‌ ఆఫీసర్‌గా వున్న నేను స్కూల్‌ టీచర్‌గా ఎలా వెళ్ళాలననేది కథ. అలాగే స్కూల్‌ టీచర్‌గా వున్న కథానాయిక పోలీస్‌ ఆఫీసర్‌గా వెళ్ళి ఏం చేసింది? అనేది కొత్తగా వుంటుంది' అన్నారు.
 
దర్శకనిర్మాత జొన్నలగడ్డ మాట్లాడుతూ... చంద్రబోస్‌ రాసిన ఐటంసాంగ్‌ ప్రత్యేకత వుంది. భూపతిరాజా కథ నచ్చడంతో నేనే నిర్మాతగా మారాను. చిత్రానికి శ్రీకాంత్‌ ఇచ్చిన సపోర్ట్‌ మరువలేనిది. రీరికార్డింగ్‌ మొదలు పెట్టబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దీపావళికి విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఎడిటింగ్‌: గౌతంరాజు, కెమెరా: సిహెచ్‌. గోపీనాథ్‌, నిర్మాతలు: జి.ఎన్‌. రెడ్డి, జి. జ్యోతిక.