బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (12:31 IST)

బాలకృష్ణ 99వ సినిమాకు లౌక్యం శ్రీవాస్ డైరక్టరట!

అవునండి.. నందమూరి హీరో బాలకృష్ణ 99వ సినిమాకు లౌక్యం సినిమా దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నూతన దర్శకుడు సత్యదేవ్‌తో బాలయ్య చేస్తున్న 'లయన్' (వర్కింగ్ టైటిల్) చిత్రం సంఖ్యాపరంగా బాలకృష్ణకు 98వ సినిమా కావడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల గోపీచంద్ హీరోగా 'లౌక్యం' చిత్రాన్ని జనరంజకంగా రూపొందించి, భారీ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీవాస్‌కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ నుంచి కూడా పెద్ద ఆఫర్ వచ్చినట్టు తాజా సమాచారం. 
 
ఇటీవల 'లౌక్యం' చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలసి వీక్షించిన బాలయ్య, ఆ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశాడట. అనంతరం దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తాడు. అంతేకాదు, అతని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సంసిద్ధత కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం.